MDK: మెదక్ పట్టణ కేంద్రంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.