NZB: పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ మేరకు రికార్డులు తనిఖీ చేసి బియ్యం పంపిణీ పై ఆరా తీశారు. ఎలాంటి అక్రమాలకు తావీయరాదని రేషన్ డీలర్ కు సూచించారు.