SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 ప్రక్రియలో భాగంగా శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి పలు క్లస్టర్లను పరిశీలించారు. మద్దూరు మండలంలోని మద్దూరు, రేబర్తి, దుల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి, దుల్మిట్ట, కొండాపూర్ గ్రామాలు, అక్కన్నపేట మండలం రామవరం గ్రామపంచాయతీల్లో నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.