NZB: బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేద్దామని, బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయిఈశ్వర్ చారి ఆత్మబలిదానం చేసుకోవడం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిమాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేశారు.