BHPL: గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఉప సర్పంచ్ పదవికి మారబోయిన ఐలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 20 సంవత్సరాలుగా ప్రజల సమస్యల పరిష్కారంలో కృషి చేసిన ఆయనకు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పూర్తి మద్దతు ఇచ్చారు. అందరి ఏకగ్రీవ అనుమతితో ఆయన ఎన్నిక కావడం గ్రామంలో ఆనందాన్ని నింపింది.