‘అఖండ 2’ వాయిదాపై అనేక వార్తలు రాయడం దురదృష్టకరమని నిర్మాత సురేష్ బాబు తెలిపాడు. అవన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులను, బయటకు వెల్లడించకూడదని చెప్పాడు. గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై విడుదలవుతుందన్నాడు.