E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.2 కోట్ల 25 లక్షలతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు.