KKD: ఏలేశ్వరం మండలంలోని పెద్దనాపల్లి గ్రామం నుంచి చిన్నంపేట జాతీయ రహదారి వరకు రూ.1.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బిటి రహదారి పనులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శుక్రవారం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ రహదారుల అభివృద్ధిని వేగవంతం చేస్తూ.. ప్రతి గ్రామానికీ మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.