EG: గోపాలపురం మండలం సగ్గొండలో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలివేణు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ వ్యతిరేకిస్తూ పలుకాలనీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం అరాచకాలను గుర్తించాలని, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి పట్టం కట్టాలన్నారు.