AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు CII పార్టనర్షిప్ సమ్మిట్లో ReNewCorpతో కుదిరిన ఒప్పందం వాస్తవరూపం దాల్చిందని మంత్రి లోకేష్ తెలిపారు. నూతన ఆవిష్కరణలకు రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. కాగా ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలో 6 GW సామర్థ్యం గల ఈ యూనిట్ స్థాపించనుంది.