TG: హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 9,292 ఎకరాల భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని అందులో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలన్నారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కోరారు.