MBNR: నగరంలోని డీసీసీ కార్యాలయంలో నూతన డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచార కార్యదర్శి బెనహర్ ప్రకటించారు. ఉదయం 10:30 గంటలకు సంజీవ్ ముదిరాజ్ నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారని, అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.