KNR: జిల్లాలోని వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహిస్తామని, ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో వారికి ప్రత్యేక తరగతి గదులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గంగాధర మండలం గట్టుభూత్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతి గదిని కలెక్టర్ గురువారం ప్రారంభించారు.