BHNG: బొమ్మలరామారం మండలంలో గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని మేడిపల్లి, మైలారం, నాగినేనిపల్లి, తిరుమలగిరి, మైసిరెడ్డి పల్లి, హాజీపూర్, పెద్దపర్వతపూర్, తూముకుంటా, రంగాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతు ప్రచారం నిర్వహించారు.