ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, డే వన్ స్టంప్స్ సమయానికి 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. జో రూట్ 135 పరుగుల అజేయ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. జాక్ క్రాలీ (76) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.