BDK: రోశయ్య సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభను ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై రోశయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సేవకే అంకితం అయిందని పేర్కొన్నారు.