AP: విజయవాడ భవానీపురం కూల్చివేతలపై APCC చీఫ్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. ‘సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా కనీసం కనికరం లేకుండా 42 ఇండ్లను కూల్చడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వ తొందరపాటు చర్య. 25 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న స్థానికులకు నీడ లేకుండా చేశారు. ఇళ్లు కోల్పోయిన బాధితులతో చంద్రబాబు మాట్లాడి న్యాయం చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు.