ఏడాదిలోపే ఇప్పుడున్న టోల్ వ్యవస్థ కనుమరుగవుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో చెప్పారు. శాటిలైట్ ద్వారా టోల్ వసూలు చేసే కొత్త సిస్టమ్ రాబోతోందని స్పష్టం చేశారు. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగాల్సిన పనిలేదని.. ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతాయని తెలిపారు. ఇప్పటికే 10 చోట్ల ఈ ప్రయోగం జరుగుతోందని, త్వరలో దేశమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు.