NZB: మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ఆలుగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయలతో బయట పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.