GDWL: అయిజ పట్టణం భరత్ నగర్ కాలనీని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి బుధవారం సందర్శించారు. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. భరత్ నగర్ కాలనీలో గత 6 నెలలుగా డ్రైనేజీ శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయన్నారు. పట్టణంలోనే ఇలా ఉంటే మరి గ్రామాల్లో ఎలా ఉంటుందన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.