MHBD: కేసముద్రం పట్టణ కేంద్రానికి చెందిన రమేష్ ఫోటో స్టూడియో నిర్వాహకుడు కుర్నా నాగేష్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు మృతుడు ఇంటికి వెళ్లి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.