CTR: చిత్తూరులో గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ తుషార్ బుధవారం పర్యవేక్షించారు. ఆయన పర్యటనలో ఎటువంటి అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపుపై ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు. భద్రతా లోపాలు లేకుండా చూడాలన్నారు.