తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం అరుణాచలం కొండపై కార్తీక మహాదీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలొస్తున్నట్లు సమాచారం.