KMM: మధిర మండలం మహాదేవపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మల్లు నందిని విక్రమార్క సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నందిని వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని ఆమె సూచించారు.