ADB: మెదక్ జిల్లాలో ఈ నెల 28 నుంచి ఆదివారం వరకు జరిగిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలబాలికల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు ప్రతిభ కనబర్చాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర, బాలికల జట్లు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖోఖో సంఘం సభ్యులు, క్రీడాభిమానులు అభినందించారు.