MBNR: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 442 సర్పంచ్, 174 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. చాలామంది ఆశావాహులు శుక్ర, శనివారాలు మంచి రోజులు కావడంతో ఆ రోజుల్లోనే భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. చాలా గ్రామాలలో ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు.