భారత ప్రధాని నరేంద్ర మోదీ(Modi) రేపు ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా పార్లమెంటులో స్పీకర్ కుర్చీ సమీపంలో ఓ బంగారు రాజదండాన్ని కూడా ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో బ్రిటీష్ పాలకులకు, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మధ్య అధికార బదలాయింపునకు ఈ రాజదండం నిదర్శనంగా నిలిచిందని, ఈ రాజదండాన్ని ‘సెంగోల్’ అని అంటారని, అది తమిళ పదం అని చరిత్రలో ఉంది.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ రజనీకాంత్ చేసిన ట్వీట్:
இந்திய நாட்டின் புதிய பாராளுமன்றக் கட்டடத்தில் ஜொலிக்கப் போகும் தமிழர்களின் ஆட்சி அதிகாரத்தின் பாரம்பரிய அடையாளம் – செங்கோல்.#தமிழன்டா
தமிழர்களுக்குப் பெருமை சேர்த்த மதிப்பிற்குரிய பாரதப்பிரதமர் @narendramodi அவர்களுக்கு என் மனமார்ந்த நன்றி.
చోళ రాజుల కాలం నుంచి ఈ రాజదండం సంప్రదాయం వస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది సినీ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) దీనిపై స్పందించారు. తమిళ శక్తికి సంప్రదాయ ప్రతిరూపం అయిన ఆ రాజదండం ఇక నుంచి భారత పార్లమెంటు నూతన భవనంలో కాంతులు విరజిమ్మనుందని అన్నారు. ఈ సందర్భంగా తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ(Modi)కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమిళంలో ట్వీట్ చేస్తూ రజనీకాంత్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.