Former Google CEO Eric Schmidt Says AI Could Cause People To Be "Harmed Or Killed"
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను (AI) సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బంది తప్పదని ఇప్పటికే పలువురు టెక్ దిగ్గజ సంస్థలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై గూగుల్ మాజీ సీఈవో కూడా స్పందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై (AI) నియంత్రణ లేకుంటే.. మానవాళికి ముప్పు తప్పదని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ (Eric Schmidt) హెచ్చరించారు. ఇటీవల వార్డ్రోట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అస్తిత్వ ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వీటి నుంచి ముప్పు ఉంటుందని చెప్పారు. నేడు ఇది కల్పన మాత్రమే అయినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చవచ్చని తెలిపారు. అటువంటిది సంభవించినప్పుడు అవి చెడు వ్యక్తుల బారినపడి దుర్వినియోగం కాకుండా చూసుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను (AI) సరైన రూపంలో వినియోగించుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని ఇప్పటికే పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎరిక్ స్మిత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గూగుల్ సీఈవోగా 2001 నుంచి 2011 వరకు కొనసాగిన ఎరిక్ స్మిత్.. 2015 నుంచి 2017 వరకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరించారు.