ASF: జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపికను అసిఫాబాద్లోని ఆదివాసీ భవన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 15 నుంచి 29ఏళ్లలోపు వారు ఈ పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు పంపిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.