E.G: ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు బుధవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బీటీ రోడ్డు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.1కోటి 85 లక్షల రూపాయల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.