WGL: నర్సంపేట మండల కేంద్రంలో బాంజిపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సమ్మయ్య మాట్లాడుతూ.. పేద ప్రజలకు సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు సన్న బియ్యం సంచులు పంపిణీ చేశారు.