MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంచుకోవాలని, భక్తితో ముక్తి లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.