ATP: సీఎంఆర్ఎఫ్ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పేదలకు రూ. 31,49,207 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె అందజేశారు. పేదలను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.