NLG: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పూజలు, అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.