WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం భారీగా డ్రంక్ & డ్రైవ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 103 కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 58, సెంట్రల్ జోన్ పరిధిలో 19, వెస్ట్ జోన్ పరిధిలో 15, ఈస్ట్ జోన్ పరిధిలో 11 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్య నేరమని, చర్యలు తప్పవని హెచ్చరించారు.