తన ఫిట్నెస్ సీక్రెట్ను బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రివీల్ చేశాడు. స్మోకింగ్ మానేయడం వల్ల తన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని అన్నాడు. తాను రోజూ రెండు సార్లు మాత్రమే భోజనం చేస్తానని, జంక్ఫుడ్స్ జోలికి వెళ్లనని చెప్పాడు. ఆహారంలో తృణధాన్యాలు, గ్రిల్డ్ చికెన్, బ్రొకోలి, పప్పుతో చేసే కూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నాడు.