కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్‌రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి గెలుపొందారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు. గాలి జనార్థన్ రెడ్డితో పాటుగా 15 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు.