ప్రస్తుతం భూమి(Land) బంగారం(Gold) అయిపోయింది. గజం జాగకూడా వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. తన భూమి జోలికొస్తే ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రం(Madhya pradesh) మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది.
Madhya Pradesh : ప్రస్తుతం భూమి(Land) బంగారం(Gold) అయిపోయింది. గజం జాగకూడా వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. తన భూమి జోలికొస్తే ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రం(Madhya pradesh) మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని లేపా(lepa) గ్రామంలో చాలాకాలంగా ఉన్న భూ వివాదం(Land Dispute) ఈ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో ముగ్గురు మహిళలు(Women) ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral)గా అవుతోంది.
కాల్పుల ఘటన జరగగానే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మోరీనా ఆసుపత్రి(Morena Hospital)కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. రంజిత్ తోమర్, రాధే తోమర్ల మధ్య ఎప్పటి నుంచో భూమి విషయంలో వివాదం కొనసాగుతుంది. ఈ కారణంగా 2014లో రంజిత్ తోమర్ కుటుంబ సభ్యులు రాధే తోమర్ కుటుంబానికి చెందిన ముగ్గురిని చంపారు. ఈ ఘటన తర్వాత రంజిత్ తోమర్ కుటుంబం గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది. అయితే ఇటీవల రంజిత్ తోమర్(Ranjit Tomar) కుటుంబం స్వగ్రామానికి తిరిగి వచ్చింది. దీంతో రాధే తోమర్ కుటుంబం ఎప్పుడెప్పుడు ప్రతీకారం(revenge) తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే రంజిత్ తోమర్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. కాల్పులు జరిపిన తర్వాత ఘటన వారి కుటుంబ సభ్యులు పారిపోయారు. అయితే నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులు సమీపంలోని పొలాలు(Fields), లోయలలో దాగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.