SKLM: పోలాకి మండలం రాళ్లపాడులో ఈనెల 2వ తేదీన రాళ్లపాడు గ్రామానికి చెందిన బోర నీలం (45) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తాటి చెట్టు పడిపోవడంతో గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడని ఎస్సై జి.రంజిత్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.