అనకాపల్లి: నకిలీ మద్యం కేసులో అధికార పార్టీకి చెందిన నాయకులు ఆధారాలతో సహా దొరికిపోయారని మాజీ మంత్రి బూడిద ముత్యాల నాయుడు విమర్శించారు. ఆదివారం మాడుగులలో మాట్లాడుతూ.. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలపై నిందలు మోపుతుందన్నారు. ఈ కేసుపై సీబీఐతో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.