SRCL: మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్ఐ వేముల లక్ష్మణ్ హెచ్చరించారు. శనివారం వీర్నపల్లిలో ఎస్సై ఆధ్వర్యంలో వాహన తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. యువత మద్యం తాగి వాహనం నడపొద్దన్నారు. చాలా మంది తాగి బండి నడిపి అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని చెప్పారు.