HNK: జిల్లా గుడిబండల్ ప్రాంతానికి చెందిన హరికిషన్ గతేడాది జూన్లో ములుగు ప్రాంతంలో రూ.1 లక్ష విలువైన iPhone పోగొట్టుకున్నాడు. బాధితుడు CEIR పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పై హన్మకొండ పోలీసులు వెంటనే స్పందించి, మొబైల్ ట్రాకింగ్ ద్వారా పోయిన ఫోన్ను గుర్తించారు. శనివారం ఇన్స్పెక్టర్ శివకుమార్ నేతృత్వంలో టీమ్ బాధితుడికి ఫోన్ను అందజేశారు.