JGL: మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కథలాపూర్లో ఆయన మాట్లాడారు. దళారులు మొక్కజొన్న పంటను క్వింటాలు రూ.1,900 చెల్లించి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. మొక్కజొన్న పంటను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలచేయాలన్నారు.