ELR: ఏలూరు సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఫిట్టర్ ఫ్యాబ్రికేషన్, అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ భూషణం తెలిపారు. 18-30 ఏళ్లలోపు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పూర్తిచేసిన వారు అర్హులు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని, ఆసక్తిగల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.