ASR: గిరి గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఆది కర్మయోగి గ్రామసభలు జరుగుతాయని అడ్డతీగల ఎంపీడీవో ఏవీవీ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం మండలంలోని తిరుమలవాడ, అమ్మపేట గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈరోజు నుంచి నవంబర్ 9వ తేదీ వరకు మండలంలో రెండో విడతలో ఎంపిక కాబడిన 60 పీవీటీజీ గ్రామాలలో ఆది కర్మ యోగి గ్రామసభలు జరుగుతాయని అన్నారు.