WNP: న్యాయ సేవాధికార సంస్థ అందించే న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డీ. కృష్ణయ్య అన్నారు. శనివారం ఆయన వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి ఈ న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా చిన్నారుల సంక్షేమ ప్రయోజనాలను వివరించారు.