GDWL: జిల్లా కేంద్రంలోని రెండో రైల్వే గేట్‌ను కొంతకాలం క్రితం అనివార్య కారణాల వల్ల మూసివేసిన అధికారులు తాజాగా దాన్ని పునః ప్రారంభించారు. ఈ రైల్వే గేట్ మళ్లీ తెరవడం వల్ల ప్రయాణికులకు చాలా సమయం ఆదా అవుతుందని, రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ గేటు ద్వారా ప్రయాణాలు యధావిధిగా నడుస్తున్నాయి.