ATP: అనంతపురం రూరల్ సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ వార్షిక తనిఖీ చేశారు. గ్రేవ్, నాన్గ్రేవ్, ప్రాపర్టీ కేసులు, రికవరీ శాతం, ప్రమాదాలు సమీక్షించి చోరీల రికవరీలు పెంచాలని, విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలని ఆదేశించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల నియంత్రణకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.