JN: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రేపు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం ఉంటుందని ప్రకటించారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.