NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, వ్యవసాయంలో యాంత్రీకరణను పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే అది లాభసాటిగా మారుతుందని తెలిపారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రైతులు, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లతో జరిగిన వర్క్ షాప్లో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయాన్ని సుస్థిరమైన ఆదాయ వనరుగా మార్చేందుకు యాంత్రీకరణ ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.